
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఎండ వాతావరణం
ఉంటుంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత పెరుగుతుంది.
– 10లోu
● 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
● సిగ్నల్ పడితే ఒకటిన్నర నిమిషాల నిరీక్షణ
● జంక్షన్‌లో వాహనదారుల అవస్థలు
జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల సెల్సిఎస్ పైచిలుకు టెంపరేచర్ నమోదవుతోంది. ఉదయం 8 గంటలకే చెమటలు కక్కిస్తు న్న సూరీడు.. 10 గంటల కల్లా భగ్గున మండిపోతున్నాడు. ఫ్యాన్ గాలి వేడెక్కి పోతుంటే.. ఏసీలు, కూలర్లు ఏమాత్రం ఉపశమనం కలిగించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జంక్షన్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో ద్విచక్రవాహన చోదకులు.. ప్రజలు ఎండ వేడికి డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. జనగామతో పాటు సమీప జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కలెక్టరేట్‌కు కొందరైతే.. వ్యాపార పరంగా సరుకుల కొనుగోలుకు మరికొందరు.. ఆస్పత్రులు, బ్యాంకులు తదితర పనుల కోసం వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. హనుమకొండ, సూర్యాపేట, హైదరాబాద్, సిద్ధిపేటరోడ్డు నుంచి వచ్చే ప్రతీ ఒక్కరు ఆర్టీసీ చౌరస్తా కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నల్ వద్ద రెడ్‌లైట్ వెలిగితే ఒకటిన్నర నిమిషాలు ఆగాలి. ఉద యం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బైక్, సైకిల్, ఆటోలో వెళ్లే వారు ఎండ దెబ్బకు గురవుతున్నారు. బైకిస్టులు సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆర్టీసీ చౌరస్తా సిగ్నల్ జంక్షన్ వద్ద వాహన చోదకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
బస్టాండ్ ఏరియా వైపు..