
నేడు అవగాహన సదస్సు
జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో నేడు (మంగళవారం) విద్యుత్ భద్రతా వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీ ఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని కట్టర్లు, ఆర్జిజియన్స్, ఓ అండ్ ఎం, ప్రొవెన్షనల్ స్టాఫ్, ఇంజ నీర్లు, యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులు హా జరై సదస్సును విజయవంతం చేయాలన్నారు.
సమస్యల పరిష్కారానికి
కలిసి పనిచేస్తాం
లింగాలఘణపురం: ఉపాధ్యాయ, ఉద్యోగుల అపరిష్కృత సమస్యల సాధనకు తెలంగాణ ఉద్యోగ జేఏసీతో కలిసి పని చేస్తామని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలో టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు జూన్ 9వ తేదీ జరగబోయే మహాధర్నాను విజయవంతం చేస్తామని తీర్మానించినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, 2024 మార్చి నుంచి ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీని నిర్వహించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చుమల్ల వెంకన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్, జిల్లా అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు.
రేపు ‘విజయోస్తు’
సన్మాన సభ
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా 3వ స్థానంలో నిలువగా.. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ సమావేశ హాలులో విజయోస్తు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది ఫలితాల్లో జిల్లాను అత్యుత్తమ స్థానంలో నిలిపిన టీచర్లు, విద్యార్థులు, ప్రతీఒక్కరికి కృతజ్ఞతగా జిల్లా విద్యాశాఖను అభినందిస్తూ జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపా రు. కలెక్టర్ రిజ్వాన్ భాషా అధ్యక్షతన జరిగే కార్యాక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అలాగే జిల్లా, మండల, మేనేజ్మెంట్, సంక్షేమ వసతి గృహాల వారీగా అత్యుత్తమ మార్కులు పొందిన 23 మంది విద్యార్థులకు సన్మానంతో పాటు సైకిళ్లను బహుమతిగా అందజేయనున్నారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ
జనగామ రూరల్: వచ్చే విద్యాసంవత్సరానికి గాను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా విద్యాశాఖాధికారి డి.భోజన్న సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని వీవర్స్ కాలనీలోని గోదాంను సందర్శించారు. జిల్లాకు 2,14,460 రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,45,742 వచ్చాయన్నారు. ఇందులో జనగామ మండలానికి 10,510 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామని, మిగతా మండలాలకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అలాగే జనగామ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 32,938 నోటు పుస్తకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల మేనేజర్ సంపత్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పాకిస్తాన్ వాసులను వెనక్కి పంపాలి
జనగామ రూరల్: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులను గుర్తించి వెనక్కి పంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం బీజేపీ నాయకులతో కలిసి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ భారత్‌లో నివాసం ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపుతున్నారన్నారు. పౌరసత్వ లేకున్నా తప్పుడు పత్రాలు సృష్టించి నివాసం ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, లద్దలూరు మహేష్, నారాయణ, లక్ష్మీనరసయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

నేడు అవగాహన సదస్సు

నేడు అవగాహన సదస్సు