
మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’
నయీంనగర్: ఎస్సెస్సీ పరీక్ష ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు గ్రేడ్ పాయింట్లతో పాటు మార్కుల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయదుందుభి మోగించినట్లు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. 590 మార్కులతో మేకల శ్రీనిత్య ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎ.సాయిసిరి 586 మార్కులు, బొల్లారపు గౌతమ్‌క్రిస్, పి.అహన్య 584, జి.రిషిక, కె.శ్రీనిధి 583, అయోషా తబుసమ్, పి.హృతిక్ రెడ్డి 581, పి.శృతిక, జి.పవన్ విదేష్, డి.సబరీష్ 580 మార్కులు సాధించారు. 579 నుంచి 570 మార్కుల వరకు 46 మంది, 569 నుంచి 560 మార్కుల వరకు 44 మంది, 559 నుంచి 550 మార్కుల వరకు 50మంది, 549 నుంచి 540 మార్కుల వరకు 61మంది విద్యార్థులు, 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 251 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్‌నగర్ బ్రాంచ్‌ల్లో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించినట్లు వివరించారు. విజయపరంపర కొనసాగించిన విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి, తల్లిదండ్రులకు పాఠశాలల ప్రిన్సిపాళ్లు పిల్లలమర్రి చంద్రశేఖర్, సంధ్య, జేపీ రావు, ఉపాధ్యాయ బృందం అభినంధనలు తెలిపారు.

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’

మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’