
కష్టపడిన వారికే ప్రాధాన్యం
జనగామ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అ ద్దంకి దయాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పా ర్టీలో నిజాయితీగా పని చేసిన వారికి భవిష్యత్ ఉంటుందన్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీకార్యకర్త పై ఉందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్టీలోకి ముందు వచ్చామా, వెనక వచ్చా మా అన్నది ముఖ్యం కాదని, పదిమందిని కదిలించి ఓట్లు వేయించే వారే అవసరమన్నారు. ఈ సమావేశంలో జనగామ ఇన్‌చార్జ్ బైకానీ లింగం యాదవ్, యాదాద్రి ఇన్‌చార్జ్ లకావత్ ధన్వంతి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మారుజోడు రాంబాబు, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ చామల
ఓట్లు వేయించే వారే ముఖ్యం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి