ఎల్‌సీ యాప్‌తో విద్యుత్ ప్రమాదాలకు చెక్
● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్
జనగామ: విద్యుత్ శాఖ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఎల్‌సీ యాప్‌ను (లైన్ క్లియర్) ప్రవేశపెట్టడం జరిగిందని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వి ద్యుత్ ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న కా ర్యక్రమాలపై ఆ శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాలపై రూ పొందించిన యాప్ అమలు తీరు తెన్నులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఎస్‌ఈ మా ట్లాడుతూ జిల్లాలో 78, 33/11కేవీ సబ్‌స్టేషన్లు ఉన్న ట్లు స్పష్టం చేశారు. ఎల్‌సీ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎల్‌సీ తీసుకునే సమయంలో యాప్ నిబంధనలు పాటిస్తూ, ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. ని బంధనలు పాటిస్తూ పని చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ డీఈలు రాంబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, విజయ్ కుమార్, ఎంఆర్‌టీ టెక్నికల్ డీఈ గణేష్, ఏడీఈలు, ఏఈలు, లైన్‌మన్లు, సిబ్బంది పాల్గొన్నారు.


