నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య విధానాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఎఫ్‌ఐ 4వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూజీసీ రూపొందించిన ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోకి వెల్లుతాయని, రాష్ట్రాల హక్కులను హరించడానికే కేంద్రం ఈ ముసాయిదాను తీసుకువచ్చిందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చూపకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, ధర్మభిక్షం, సందీప్, సుమా తదితరులు పాల్గొన్నారు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మూర్తి


