● సబ్సిడీ, ఉజ్వల సిలిండర్లపై రూ.50 పెంపు
జనగామ: కేంద్రం సబ్సిడీ, ఉజ్వల గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచింది. పెట్రో, డీజిల్ ధరలను సైతం పెంచగా.. ఆ భారమంతా ఆయిల్ కంపెనీ లే భరిస్తాయని ప్రకటించడం కొంత ఊరట అని చెప్పవచ్చు. సబ్సిడీ సిలిండర్ ప్రస్తుత ధర రూ.857 ఉంది. ఇందులో ఉజ్వల సిలిండర్‌కు రూ.300, సబ్సిడీ బండపై కేంద్రం రూ.40, రాష్ట్ర ప్రభుత్వం రూ.319 వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. జిల్లాలో 12 గ్యాస్ కంపెనీలు ఉండగా, 1.50లక్షల సబ్సిడీ సిలిండర్లు ఉన్నాయి. ఇందులో 10వేల వరకు ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.50 పెంపుతో జిల్లా గ్యాస్ వినియోగదారులపై నెలనెలా అదనంగా రూ.75 లక్షల మేర భారం పడనుంది.


