ఎల్‌ఆర్‌ఎస్‌ను పారదర్శకంగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ రూరల్: ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలించాలన్నారు. అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.


