● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
ఖిలా వరంగల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ రంగశాయిపేటకు చేరుకోగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాక బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతకు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరంత దామోర కొండ సదా నందం అధ్యక్షతన జరిగన సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనై ఉంటానని అన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతులు తెలిపారు. కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, సతీష్, తిరుపతిరెడ్డి, అబ్దుల్ గోపాల్, విజయపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, దయాకర్ పాల్గొన్నారు.