పెద్దమడూరు గ్రామంలోని పీర్వావాయుకుంట ఆరు ఎకరాల విస్థీర్ణంలో జలకళతో ఉండేది. మూడేళ్ల క్రితం గండి పడింది. గోదావరి జలాలు, వరద నీళ్లు ఇచ్చినా.. నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి. కుంటకింద 20 బోర్లు, ఐదు బావుల పై ఆధారపడి సుమారు 20 మందికి పైగా రైతులు పంటల సాగు చేస్తున్నారు. గండిని పూడ్చాల ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నా ప్రయోజనం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు, బావులు ఎండిపోయాయి. ‘వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం. సమస్య పరిష్కరించాలి’ అని రైతులు కోరారు.
– పెండెల దశరథ, రుద్రోజు ఉప్పలయ్య, రైతులు, పెద్దమడూరు(దేవరుప్పుల)