ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక

Mar 10 2025 10:42 AM | Updated on Mar 10 2025 10:38 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: భారత ప్రభుత్వం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అందించే ఇన్‌స్పైర్‌ అవార్డులు 2024–25 సంవత్సరానికి గాను మండలంలోని తాటికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బురుగు రాజు, నారబోయిన శ్రీమాన్‌, పూల జశ్వంత్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డులకు ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎం లింగమూర్తి, పీడీ గీరెడ్డి ప్రమోద్‌రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్‌ బేతి మంజుల, గైడ్‌ టీచర్లు మురళి, అనసూయ, శ్రీనివాస్‌, రవీందర్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

12న జిల్లా స్థాయి

యవజన ఉత్సవాలు

జనగామ రూరల్‌: ఈనెల 12న నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌ చింతల అన్వేష్‌ తెలిపారు. ఆదివారం పట్టణంలోని జిప్స్‌ కళాశాలలో జరిగిన సమావేశంలో పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. పోటీల్లో యంగ్‌ రైటర్స్‌, యంగ్‌ ఆర్టిస్ట్‌, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సంస్కృతిక జానపద నృత్యం (గ్రూప్‌) సైన్స్‌ ఎగ్జిబిషన్‌ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసపత్రం అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని యువజన సంఘాలు, కళాశాల విద్యార్థులు త మ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9502126384, 9505496034 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

సర్వాయి పాపన్న జిల్లాగా గెజిట్‌ విడుదల చేయాలి

రఘునాథపల్లి: బహుజన పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా గెజిట్‌ విడుదల చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని రఘునాథపల్లి, ఖిలాషాపూర్‌లో జరిగిన పాపన్న జనగామ జిల్లా సాధన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుజనుల రాజ్యాధికారం కోసం అలుపెర గని పోరాటం చేసిన ఘనత సర్వాయి పాపన్నదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే జిల్లాకు పాపన్న పేరు పెట్టాలన్నారు. ఈ నెల 21న కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద పాపన్న జిల్లా సాధన కోసం చేపట్టిన ఒక్క రోజుకు దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ ముప్పిడి శ్రీధర్‌, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తిని మురహరి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ప చ్చిమడ్ల మానస, కొప్పుల రవీందర్‌, బండి కు మార్‌, నూనెముంతల యాకస్వామి, రంగు రాజు, కోళ్ల శ్రీను, తాళ్లపల్లి రాజు, బండమీది వెంకన్న, బాల్నె రాజయ్య, రంగు మురళి, పర్షరాములు, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆత్మస్థైర్యంలో ముందుకు సాగాలి

హన్మకొండ కల్చరల్‌ : మహిళలు అన్ని రంగా ల్లో దూసుకుపోవడానికి ఆత్మస్థైర్యం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. ఆదివారం వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలువురు మహిళలను సన్మానించారు.

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక1
1/4

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక2
2/4

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక3
3/4

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక4
4/4

ఇన్‌స్పైర్‌ అవార్డులకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement