
దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో సమీక్షిస్తున్న ఏసీపీ
● వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు
దేవరుప్పుల: గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల పరిధిలో పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఇటీవల భూముల ధరలు పెరగడంతో ఊరూరా భూసమస్యలతో క్రైం రేట్ పెరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్, ఎస్సై మునావత్ రమేష్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు పెంచాలి
జనగామ: సాధారణ ప్రసవాలు పెంచాలని హైదరాబాద్ ఫెర్నాండెజ్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ప్రాజెక్టు ప్రతినిధులు(యూఎస్‌ఏ) డాక్టర్లు జో–ఆన్, వినీల అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని(ఎంసీహెచ్) సందర్శించిన వారు.. ఈ మేరకు డాక్టర్లు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ నెలలో జరిగే ప్రసవాల్లో 90శాతం నార్మల్ ఉండాల ని, డెలివరీకి వచ్చిన గర్భిణితోపాటు కుటుంబ సభ్యులకు సాధారణ కాన్పుపై అవగాహన కలిగేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు, ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ దీపిక, డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంసీహెచ్ వద్ద ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ప్రతినిధులు