
సమావేశంలో మాట్లాడుతున్న రంజిత్ కుమార్
జనగామ రూరల్: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలలుగా ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వడం లేదని, సప్లమెంట రీ వేతనాలు, సెలవుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. సమస్యలపై నేడు హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, జయప్రకాష్, సుధాకర్, వెంకటేష్, యాదవరెడ్డి, నర్సయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
రంజిత్‌కుమార్