జగిత్యాలటౌన్: కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం
జగిత్యాలటౌన్: సీతారామాంజనేయస్వామి ఆలయంలో భక్తులు
ధర్మపురి: కల్యాణ వేడుకలకు హాజరైన భక్తజనం
పల్లె, పట్టణాలు శ్రీరామ నామ స్మరణతో మారుమోగాయి. శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై శ్రీసీతారాముల కల్యాణం నయనానందంగా జరిపారు. దొంతాపూర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వామివారలను దర్శించుకున్నారు. జగిత్యాల పట్టణం విద్యానగర్ శ్రీసీతారామచంద్రస్వామి తదితర ఆలయాల్లో స్వామివారల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ధరూర్ క్యాంపు శ్రీకోదండరామాలయంలో కౌన్సిలర్ బోయినిపల్లి ప్రశాంత్‌రావు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లాపూర్ మండలం సిరిపూర్‌లోని శ్రీరామాలయం, రాయికల్ మండలం అయోధ్యలో నిర్వహించిన వేడుకలకు భక్తులు తరలివచ్చి కల్యాణం తిలకించారు.
– సాక్షి నెట్‌వర్క్
మల్లాపూర్: సిరిపూర్‌లోని శ్రీరామాలయంలో..
రాయికల్: అయోధ్యలో కల్యాణం తిలకిస్తున్న భక్తులు
ధర్మపురి: దొంతాపూర్‌లో స్వామివారలను దర్శించుకుంటున్న మంత్రి
రాయికల్: చిన్నారుల వేషధారణ


