● వైస్ చైర్మన్‌గా రామన్న ● నాగలక్ష్మికి రెండేళ్లు.. సం
ధర్మపురి: ధర్మపురి బల్దియా కార్యాలయంలో సోమవారం పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆర్డీవో మధుసూదన్ ఆధ్వర్యంలో.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమక్షంలో కౌన్సిలర్లు సమావేశానికి గంట ఆలస్యంగా 12 గంటలకు వచ్చారు. ముందుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మిని 15వ వార్డు కౌన్సిలర్ ఒజ్జల లక్ష్మణ్ ప్రతిపాదించగా.. ఒకటో వార్డు కౌన్సిలర్ అయ్యోరి వేణుగోపాల్ బలపర్చారు. పోటీ లేకపోవడంతో నాగలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నికై నట్లు ప్రకటించారు. ముందుగా చైర్‌పర్సన్ పదవికి నాగలక్ష్మితోపాటు రెండో వార్డు కౌన్సిలర్ సంగనభట్ల సంతోషి పోటీపడ్డారు. మంత్రి చొరవ తీసుకుని నాగలక్ష్మికి రెండేళ్లు, మిగిలిన మూడేళ్లు సంగనభట్ల సంతోషి కొనసాగాలని నచ్చజెప్పారు. అలాగే వైస్ చైర్మన్‌గా ఇందారపు రామన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధర్మపురిలో మొత్తం 15 వార్డులకు15 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులే గెలుచుకోవడంతో ప్రతిపక్షం లేని మున్సిపాలిటీగా ఏర్పడింది.
అధిష్ఠానం నిర్ణయం మేరకే..
వేముల నాగలక్ష్మికి రెండేళ్లు.. సంగనభట్ల సంతోషి మూడేళ్లపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగాలన్నది అధిష్టానం నిర్ణయమని మంత్రి అడ్లూరి తెలిపారు.


