‘చేయి’ ఎత్తని అడువాల జ్యోతి | - | Sakshi
Sakshi News home page

‘చేయి’ ఎత్తని అడువాల జ్యోతి

Feb 17 2026 8:13 AM | Updated on Feb 17 2026 8:13 AM

‘చేయి’ ఎత్తని అడువాల జ్యోతి

‘చేయి’ ఎత్తని అడువాల జ్యోతి

జగిత్యాల: కాంగ్రెస్‌ పార్టీ విప్‌ జారీ చేసినా 40వార్డు నుంచి గెలిచిన అడువాల జ్యోతి మాత్రం పార్టీ సూ చించిన చైర్‌పర్సన్‌ అభ్యర్థి సమిండ్ల వాణికి మద్దతి వ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాణిని చైర్‌పర్సన్‌గా ప్రకటించగానే ఆమె సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, 39మంది మద్దతు ఉండగా.. తన ఓటు ఉన్నా.. లేకున్నా ఒక్కటేనని పేర్కొన్నారు. గతంలో జ్యోతి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. చైర్‌పర్సన్‌గా బోగ శ్రావణి రాజీనామా చేయడం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తిరిగి చైర్‌పర్సన్‌కు ఎన్నిక నిర్వహించడంతో సమిండ్ల వాణి, జ్యోతి పోటీపడ్డారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వాణి కి మద్దతు ఉన్నా.. జ్యోతి కాంగ్రెస్‌ మద్దతుతో చైర్‌పర్సన్‌గా ఎన్నికై ఏడాది కొనసాగారు. ఇప్పుడు వాణికి అవకాశం రాగా.. మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నాడు చేజారింది.. నేడు వరించింది

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి నాడు చేజారినా ఈసారి వాణిని వరించింది. మొదటి నుంచి చైర్‌పర్సన్‌ కోసం ప్రయత్నిస్తున్న ఆమె ఎమ్మెల్యే మద్దతుతో చైర్‌పర్సన్‌ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement