కొండగట్టులో పట్టభద్రుల ఎమ్మెల్సీ పూజలు
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామివారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆయన వెంట సర్పంచ్ నడిపి మల్లేశం, నాయకులు ఉన్నారు.
19న అంజన్న హుండీల ఆదాయం లెక్కింపు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తుల ద్వారా వచ్చి హుండీల ఆదాయాన్ని ఈనెల 19న నిర్వహించనున్నట్లు ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. దేవాదాయశాఖ అధికారి పర్యవేక్షణలో లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.
సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయం
పెగడపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన మహారాజ్ సంత్‌సేవాలాల్ మార్గం అనుసరణీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రాజరాంపల్లి తాండాలో సోమవారం నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారముంటుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ రమేశ్‌నాయక్, ఏడుమోటలపల్లి మాజీ సర్పంచ్ రవినాయక్, కాంగ్రెస్ శ్రేణులు తిరుపతి, రాజేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, అంజినాయక్, రాజ్‌కుమార్, స్థానిక గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయానికి అధికార పార్టీ రంగులు?
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పెంబట్ల దుబ్బరాజేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని అధికారులు రంగులు వేయించారు. అయితే అధికార పార్టీకి చెందిన రంగులు వేశారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ గోపురానికి కాంగ్రెస్ జెండా రంగులు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రంగులను మార్చాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారు.
జేఎన్టీయూ విద్యార్థుల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం
కొడిమ్యాల: నాచుపల్లిలో జేఎన్టీయూ ఎన్‌ఎస్ ఎస్ విద్యార్థులు వారంరోజులపాటు స్పెషల్ క్యాంప్‌నకు వెళ్లారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ హాజరై గ్రామస్తులకు రోజుకోఅంశంలో అవగాహన కల్పిస్తామన్నారు. మొదటిరోజు అభివృద్ధిలో గ్రామస్తుల చేయూత, ప్రశ్నించేతత్వం, డిజిటల్ లావాదేవీలు, మోసాలపై అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ నాగమణి, ఉపసర్పంచ్ మమత, వార్డుసభ్యులు, గ్రామస్తులు భరత్, అజయ్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా
ఎడ్లబండ్ల పోటీలు
వెల్గటూర్: మండలంలోని వెంకటాపూర్‌లో వె లసిన స్వయంభూ కట్టా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు స్థానికులను, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో నరేష్ గౌడ్, వెనుగుమట్ల, మొదటి స్థానం,షేక్ బాష్ మియ్య, తిరుమలాపూర్, రెండో స్థా నం, వొడ్నాల మారుతి, దొనకొండ సుధీర్ సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బిల్లకూ రి తిరుపతి, ఉపసర్పంచ్ అల్లం శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు,పాల్గొన్నారు.
కొండగట్టులో పట్టభద్రుల ఎమ్మెల్సీ పూజలు
కొండగట్టులో పట్టభద్రుల ఎమ్మెల్సీ పూజలు


