మెట్‌పల్లి పీఠం ‘హస్త’గతం | - | Sakshi
Sakshi News home page

మెట్‌పల్లి పీఠం ‘హస్త’గతం

Feb 17 2026 8:13 AM | Updated on Feb 17 2026 8:13 AM

మెట్‌

మెట్‌పల్లి పీఠం ‘హస్త’గతం

● కాంగ్రెస్‌కు నలుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్‌ మద్దతు ● అత్యధిక స్థానాలు గెలుచుకున్నా పీఠాన్ని దక్కించుకోలేకపోయిన కమలం ● తటస్థంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ● మున్సిపల్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. ● స్పెషలాఫీసర్‌, ఆర్డీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ● ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో మొదట బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లతో పాటు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో ఆర్డీఓ ప్రమాణం చేయించారు. ● చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ నుంచి మైలారపు లింబాద్రి, బీజేపీ నుంచి ధర్మపురి స్వరూప, బీఆర్‌ఎస్‌ తరఫున పూదరి జ్యోతి బరిలో నిలిచారు. ● లింబాద్రికి ఆరుగురు కాంగ్రెస్‌, నలుగురు ఇండిపెండెంట్లు, బీజేపీ కౌన్సిలర్‌ చేతులెత్తి మద్దతు తెలిపారు. ● ధర్మపురి స్వరూపకు చెట్లపల్లి మీనా మినహా మిగతా తొమ్మిది మంది మద్దతు వ్యక్తం చేశారు. ● పూదరి జ్యోతికి ఆరుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియోగా ఉన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ మద్దతు ఇచ్చారు. ● ముగ్గురిలో లింబాద్రికి అత్యధికంగా 11మంది మద్దతు ఉండడంతో ఆయన చైర్మన్‌గా ఎన్నికై నట్లు ప్రకటించారు. ● వైస్‌చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ నుంచి ఓంకార్‌ నవీన్‌, బీజేపీ నుంచి పుడుకారం దివ్యారెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి అంగడి పురుషోత్తం పోటీ చేశారు. ● నవీన్‌కు ఆరుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నలుగురు ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చారు. ● చైర్మన్‌ ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన మీనా.. వైస్‌చైర్మన్‌ ఎన్నికల్లో తటస్థంగా ఉన్నారు. ● దివ్యారెడ్డికి తొమ్మిది మంది బీజేపీ కౌన్సిలర్లు, పురుషోత్తంకు ఆరుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే సంజయ్‌ మద్దతు తెలిపారు. ● నవీన్‌కు మెజార్టీ సభ్యుల మద్దతు దక్కడంతో ఆయన వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మెట్‌పల్లి: బల్దియాలో తక్కువ స్థానాలు గెలిచినా.. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి మున్సిపల్‌ పీఠాన్ని ‘చే’జిక్కుంచుకుంది. నలుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్‌ మద్దతుతో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను దక్కించుకుంది. అత్యధిక స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ఆ పార్టీ నుంచి హ్యాట్రిక్‌ విజేతగా నిలిచిన కౌన్సిలర్‌ చెట్లపల్లి మీనా ఝలక్‌ ఇచ్చారు. ఆమె కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో కమలానికి పీఠం దక్కకుండా పోయింది. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీకి మద్దతు ఇవ్వకుండానే బీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపింది.

మొదట ప్రమాణం..తర్వాత చైర్మన్‌ ఎన్నిక

స్వతంత్రుల మద్దతుతోనే వెస్‌చైర్మన్‌ కై వసం..

చెట్లపల్లి మీనా దంపతులపై సస్పెన్షన్‌ వేటు

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన బీజేపీ కౌన్సిలర్‌ చెట్లపల్లి మీనా విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మీనాతో పాటు ఆమె భర్త చెట్లపల్లి సుఖేందర్‌గౌడ్‌ను ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేసినట్లు బీజేపీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌ రవీందర్‌ విశ్వనాథ్‌ తెలిపారు.

మెట్‌పల్లి పీఠం ‘హస్త’గతం 1
1/1

మెట్‌పల్లి పీఠం ‘హస్త’గతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement