జగిత్యాల కాంగ్రెస్ వశం
జగిత్యాల: జగిత్యాల బల్దియాపై కాంగ్రెస్ జెండా మరోసారి ఎగిరింది. చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో చైర్‌పర్సన్‌గా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సమిండ్ల వాణి, వైస్ చైర్‌పర్సన్‌గా జీనత్ పర్వీన్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లతో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయించిన అధికారులు 12.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్లను పంపించగా.. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అధికారులకు అందించి 23మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకు విప్ జారీ చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారం ఒకరు ఇంగ్లిష్‌లో.. ముగ్గురు ఉర్దూలో.. మిగతావారందరూ తెలుగులో చేశారు. చైర్‌పర్సన్ ఎన్నిక కోసం స్పెషల్ ఆఫీసర్ ఆహ్వానించగా.. 43వ వార్డు నుంచి గెలిచిన సమిండ్ల వాణిని 18వ వార్డు కౌన్సిలర్ కూతురు శేఖర్ ప్రతిపాదించారు. 27వవార్డు కౌన్సిలర్ జుంబర్తి గంగలక్ష్మీ బలపర్చారు. బీజేపీ నుంచి చైర్‌పర్సన్‌గా పోటీలో ఉంటున్నట్లు 45వ వార్డు కౌన్సిలర్ గట్టపల్లి మానస 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణను ప్రతిపాదించగా.. 5వ వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్ బలపర్చారు.
సమిండ్ల వాణికి 39 ఓట్లు
కాంగ్రెస్ నుంచి చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి పోటీ చేస్తున్నారని ఎన్నికల అధికారి మదన్‌మోహన్ తెలపగా.. 39 మంది మద్దతుగా చేతులు లేపారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన 23మంది, స్వతంత్రులు, ఎంఐఎంకు చెందిన వారు ఉన్నారు. బీజేపీ నుంచి రేసులో ఉన్న కొండ అరుణకు ఆరుగురే మద్దతు తెలిపారు. దీంతో సమిండ్ల వాణి చైర్‌పర్సన్ ఎన్నికై నట్లు మదన్‌మోహన్ ప్రకటించారు. వైస్ చైర్‌పర్సన్‌గా 35వ వార్డు నుంచి గెలుపొందిన జీనత్ పర్వీన్ ఎన్నికయ్యారు. ఆమెకు పోటీగా ఎవరూ రాకపోవడంతో ఏకగ్రీవమయ్యారు.
ఎమ్మెల్యే అభినందనలు
చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, వైస్ చైర్‌పర్సన్‌గా పర్వీన్‌ను ఎమ్మెల్యే అభినందించారు.
జగిత్యాల కాంగ్రెస్ వశం


