4 కాంగ్రెస్.. ఒకటి బీఆర్‌ఎస్
‘హస్తం’ ఖాతాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి
రాయికల్‌ను కై వసం చేసుకున్న బీఆర్‌ఎస్
ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లు
ప్రశాంతంగా ముగిసిన పురపాలక ఎన్నిక ఘట్టం
జిల్లాలో పురపాలక ఘట్టం సభ్యులు ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికతో ముగిసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జిల్లాకేంద్రమైన జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి బల్దియాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. రాయికల్‌లో మాత్రం బీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మెట్‌పల్లిలో నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా.. మిగిలిన చోట్ల సునాయసంగా చైర్మన్ పీఠంపై కూర్చుంది. మొత్తంగా పుర ఎన్నికలు ముగియడంతో అధికారులు, నాయకులు ఊపిరిపీల్చుకున్నారు.


