ప్రజాభవన్‌కు జగిత్యాల పంచాయితీ
అటు మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గెలిచిన అభ్యర్థులతో ఇరువర్గాలూ హైదరాబాద్‌లోనే మకాం చైర్‌పర్సన్ పీఠం కోసం పావులు
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. బల్దియాలో కాంగ్రెస్‌తోపాటు స్వతంత్రులుగా గెలిచిన కౌన్సిర్లు ఓ వైపు మాజీమంత్రి జీవన్‌రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గాలుగా విడిపోయారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెబుతూ కాంగ్రెస్ వైపే ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల బీఫామ్ విషయంలో అధిష్టానం ఆయనకే ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్‌లో సీనియర్ అయిన జీవన్‌రెడ్డికి ప్రాధాన్యం తగ్గించింది. అయినా ఆయన స్వతంత్రుల తరఫున ప్రచారం చేసి 10మందిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నవారిలోనూ ఈయన వర్గం నుంచి ఏడుగురు గెలిచారు. వారందరితో జీవన్‌రెడ్డి నేరుగా హైదారబాద్‌లో క్యాంప్ వేశారు. సంజయ్‌కుమార్ కూడా అతని తరఫున నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థులు 16 మంది, మరో ఇద్దరు స్వతంత్రులతోపాటు ఇద్దరు బీజేపీ రెబల్స్, ఎంఐఎంకు చెందిన ఇద్దరిని తీసుకుని హైదరాబాద్‌లో క్యాంప్ వేశారు.
మంత్రి కోర్టులోకి బంతి
ఈ విషయంపై ఇద్దరితోనూ మాట్లాడి గొడవను సద్దుమణిగించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి నేరుగా తన వర్గీయులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసమైన ప్రజాభవన్‌కు వెళ్లారు. ఆయనతో చేసిన మంతనాలు ఫలించి.. జీవన్‌రెడ్డి వర్గంలోని ఒకరికి చైర్‌పర్సన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేరుగా కార్యాలయానికే...
హైదరాబాద్‌లో మకాం వేసిన ఇరువర్గాల కౌన్సిలర్లు చైర్‌పర్సన్ ఎన్నిక సమయానికి స్థానిక మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వారికి నోటీసులు జారీ చేయడంతో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేసి 12.30 గంటలలోపు చైర్మన్ ఎన్నికవుతారు.


