ఆస్తి పన్ను కట్టం
కోరుట్ల: ఐదేళ్ల క్రితం కోరుట్లలో విలీనమైన ఎఖీన్‌పూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసన తెలుపుతూ గ్రామస్తులు మున్సి పల్ పన్ను కట్టేందుకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం పన్ను వసూలు కోసం విలీన గ్రామానికి మున్సిపల్ ఉద్యోగులు వెళ్లిన సందర్భంగా ఈ విషయమై నిలదీశారు. ఐదేళ్లుగా మున్సిపాల్టీకి ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లి స్తున్నా, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో వి వక్ష కనిపించిందని గ్రామానికి చెందిన శంకర్ అన్నారు. పంచాయితీగా ఉన్నప్పుడు పన్ను తక్కువగా ఉండేవన్నారు. మున్సిపల్ పరిఽధిలోకి రావడంతో పెద్ద మొత్తంలో పన్ను కడుతున్నామని, అయినా ఎలాంటి ప్రగతి కనిపించడం లేదన్నారు. ఇప్పటికై నా గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, లేకుంటే పన్ను చెల్లింపులో నిరాకరణ కొనసాగిస్తామని యువజన సంఘాల ప్రతినిధి జాగిలం భాస్కర్ తెలిపారు.


