క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు.
ప్రసూతి సేవలు పెంచాలి
పెగడపల్లి(ధర్మపురి): ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతి సేవలు పెంచాలని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్ తదితర వాధ్యులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్‌వో సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.
కూరగాయల రైతులకు ప్రోత్సాహకం
జగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయలు సాగు చేసే రైతులకు ఉద్యానశాఖ తరుఫున ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఉద్యానశాఖాధికారి గడ్డం శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో పాలెపు వసంత 10 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తుండగా, శుక్రవారం పంట పొలాలను జిల్లా ఉద్యానశాఖాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో బీర, టమాట, కాకర, సోర, దోస వంటి కూరగాయలు సాగు చేస్తుండడం అభినందనీయమన్నారు. కూరగాయలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చుల కోసం ఎకరాకు రూ.9,600 సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి కె.స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కథలాపూర్(వేములవాడ): మండలంలోని గంభీర్‌పూర్ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు మ్యాకల వర్షిత్, మెట్టు గీతాంజలి జాతీయస్థాయి అత్య పత్య పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం సుధాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. చంఢీఘర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మన రా ష్ట్ర జట్టు తరుఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను అత్య పత్య క్రీడల జిల్లా అధ్యక్షుడు వాసం నవీన్‌కుమార్, కార్యదర్శి రాజేశ్, రవీందర్ అభినందించారు.
నక్షతో భూముల లెక్క పక్కా
జగిత్యాల: భూములకు పక్కాగా లెక్కలుండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల మున్సిపాలిటీ ఎంపికై ంది. గతంలోనే ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా జాప్యం జరిగింది. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నక్ష కార్యక్రమంతో భూములకు రక్షగా ఉంటుందని, డ్రోన్లతో చిత్రీకరించి ప్రతి ఒక్క ఆస్తికి అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించడం జరుగుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఐ విఠల్ పాల్గొన్నారు.
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ


