బీసీల
పెరిగిన చైతన్యంతో మారిన పరిస్థితి
● స్థానిక సమరంలో సత్తా ● 600 జనరల్ స్థానాల్లో 329 చోట్ల గెలుపు ● ఎస్సీ, ఎస్టీలు కూడా జనరల్ స్థానాల్లో గెలిచిన వైనం ● పల్లెల్లో మారుతున్న రాజకీయ ముఖచిత్రం
విజయబావుటా
పెద్దపల్లి
జగిత్యాల
సిరిసిల్ల
కరీంనగర్
సాక్షి పెద్దపల్లి/జగిత్యాల:
‘బీసీల ఓటు బీసీలకే’ అన్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన కులాల అభ్యర్థులు సత్తా చాటారు. బలహీన వర్గాలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ విజయాబావుటా ఎగురవేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఆ మేరకు ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఆ రిజర్వేషన్లను రద్దు చేసి 50 శా తం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని కోర్టు సూ చించింది. స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మూ డుదశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. పెరిగిన చైతన్యం, బీసీ నినాదం విస్తరించడంతో జనరల్‌స్థానాల్లోనూ బీసీలు బరిలో నిలిచి గెలుపొందారు.
జనరల్లోనూ పాగా
ఉమ్మడి జిల్లాలో బీసీలకు కేటాయించిన 297 స్థానాలతోపాటు అదనంగా 600 జనరల్‌స్థానాల్లో బీసీలు పోటీచేసి 329 చోట్ల విజయం సాధించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించిన 1,226 పంచాయతీల్లో 51.06 శాతం సీట్లను బీసీలే దక్కించుకున్నట్లు అయ్యింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో బీసీలు జనరల్‌స్థానాల్లో గెలుపొందగా, తర్వాతి స్థానాల్లో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీలు సైతం జనరల్ స్థానాల్లో పోటీచేసి విజయం సాధించడం గమనార్హం. మంథని డివిజన్‌లోని జనరల్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీలు, అంతర్గాం జనరల్‌లో ఒక ఎస్సీ మహిళ విజయం సాధించగా, పెద్దపల్లిలో ఒకరు, అంతర్గాంలో ఒక ఎస్టీ గెలుపొందారు.
గత ఎన్నికలతో పోల్చితే తక్కువే..
● 2019 పంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లిలోని 263 పంచాయతీల్లో 68 సీట్లు బీసీ స్థానాలతోపాటు, జనరల్‌స్థానాల్లో మరో 74మంది బీసీలు గెలుపొందారు. మొత్తంగా 142మంది విజయం సాధించారు.
● సిరిసిల్ల జిల్లాలోని 252 పంచాయతీల్లో 56 బీసీ రిజర్వ్ సీట్లతోపాటు జనరల్‌లో 80 మంది గెలవడంతో మొత్తంగా 136 మంది బీసీలు గెలిచినట్లయ్యింది.
● కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీల్లో బీసీలకు కేటాయించిన 74 సీట్లతోపాటు జనరల్‌లో 120 మంది గెలుపొందగా బీసీలకు మొత్తంగా 194 సీట్లు దక్కాయి.
● జగిత్యాల జిల్లాలోని 379 గ్రామ పంచాయతీల్లో 94 బీసీ స్థానాలతోపాటు జనరల్‌లో బీసీలు 185 చోట్ల విజయం సాధించి మొత్తంగా చూసుకుంటే 279 మంది బీసీలు సర్పంచ్ కిరీటాలు దక్కించుకున్నారు.
● మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే.. గతంలో 751 మంది బీసీ సర్పంచులు కుర్చీ దక్కించుకుంటే.. ఈసారి 626 మంది బీసీలే సర్పంచులుగా ఎన్నికయ్యారు. గతంలో పోల్చితే బీసీల ప్రాతినిధ్యం తగ్గినట్లయ్యింది.
గతంలో జనరల్ స్థానాల్లో ఓసీలు మాత్రమే పోటీచేయాలనే అపోహ ఉండేది. దీనికితోడు జనరల్‌లో పోటీ చేయాలంటే ఓసీలకు ఉండే డబ్బు, పలుకుబడితో బీసీలు పోటీపడేవారు కాదు. పెరిగిన రాజకీయ చైతన్యం, బీసీ నినాదంతోపాటు, అధికార వ్యవస్థలపై అవగాహన పెరగడం, బీసీల్లో చదువుకున్న వారిసంఖ్య అధికం కావడం, ఖర్చుకు కూడా వెనుకాడని పరిస్థితులు రావడం, చాలాగ్రామాల్లో కొన్నేళ్లుగా పాతుకుపోయిన పెత్తందారీ వ్యవస్థకు చెక్‌పెట్టేలానే భావన బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో రావడంతో చాలాచోట్ల జనరల్ అభ్యర్థులను ఢీకొట్టి బీసీ నేతలు విజయం సాధించారు. ఇదే ఒరవడిని కొనసాగించి వచ్చే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటుతామని ఆ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గెలిచినవి మొత్తం
జనరల్‌లో బీసీలు
బీసీరిజర్వ్
బీసీల
బీసీల
బీసీల
బీసీల
బీసీల
బీసీల


