పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు
జగిత్యాల: పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థు లు సైతం ప్రచారాలకు తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్లు పూర్తిగా దాఖలు చేయకుంటే రిజెక్ట్ అవుతాయని పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 3 ఎస్‌ఎస్‌టీ, 20 ఎఫ్‌సీటీ బృందాలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక బృందాల్లో మెజిస్ట్రేట్ స్థాయి అధికారులు ఉంటారని చెప్పారు. పార్టీల నాయకులు పెట్టే ప్రలోభాలు, ఇచ్చే బహుమతులు, పంచే డబ్బులు, మద్యం వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉందన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, పరిశీలకులు రమేశ్, మనోహర్, మదన్‌మోహన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా అమలు చేయాలి
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): ఎన్నికల నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ అన్నారు. మెట్‌పల్లి మండలం చౌలమద్ది క్లస్టర్ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. నోటీస్ బోర్డుపై ప్రదర్శించిన రిజర్వేషన్ వివరాలు పరిశీ లించి, నామినేషన్ సరళిని తెలుసుకున్నారు. రికార్డు ల నిర్వహణ సరిగా చేయాలని సిబ్బందికి సూచించారు.
కలెక్టర్ సత్యప్రసాద్


