విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజంలో గుర్తింపు ఉండాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం జగిత్యాల ఓల్డ్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి బాలవైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మానక్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తలుగా మారాలని, ఈ ప్రదర్శనల ద్వారా నైపుణ్యం పెంపొందుతుందన్నారు. అదనపుక లెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం మన దేశంలో శాస్త్రవేత్తగా ఆవిష్కరణలు చేయనట్లయితే డిఫెన్స్‌లో మనం ఇతర దేశంపై ఆధారపడాల్సి వచ్చేదనాన్నారు. అదేస్థాయిలో విద్యార్థులు ప్రదర్శించాలన్నారు. సమాజంలో విద్యార్థులకు గుర్తింపు లభించినప్పుడే తల్లిదండ్రులకు గౌరవం దక్కుతుందన్నారు. డీఈవో రాము, సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ పాల్గొన్నారు.


