నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
కోరుట్లరూరల్: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని మోహన్‌రావుపేటలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్‌బోర్డుపై ప్రదర్శించారా.. లేదా తెలుసుకున్నారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. డీపీవో రఘువరన్, ఆర్డీవో జివాకర్‌రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ కృష్ణ చైతన్య తదితరులు ఉన్నారు.
అయిలాపూర్‌లో ఎస్పీ..
మండలంలోని అయిలాపూర్, పైడిమడుగు గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన అబ్జర్వర్లు
జగిత్యాల: ఎన్నికల అబ్జర్వర్లు జి.రమేశ్, మనోహర్ గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిశారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, వ్యయం నిర్వహణపై చర్చించారు.


