ఆర్డీవో కార్యాలయం ఎదుట అయ్యప్ప స్వాముల నిరసన
మెట్‌పల్లి: పోలీస్ ఉన్నతాధికారులు అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తున్నారంటూ దీక్షాపరులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. దీక్ష తీసుకుంటే సెలవు పెట్టాలంటూ పోలీసులు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ అయ్యప్ప దీక్షాపరులు డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. గంగుల వివేక్, దొమ్మాటి ప్రవీణ్, అంకతి భరత్, బండారి మారుతి, అవుట్ల లక్ష్మణ్, బాశెట్టి హరీశ్, మర్రి నర్సయ్య ఉన్నారు.


