అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు | - | Sakshi
Sakshi News home page

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

Nov 28 2025 8:41 AM | Updated on Nov 28 2025 8:41 AM

అంతర్

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన సుద్దాల దేవయ్య 1983లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1985లో జెడ్పీ చైర్మన్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 1994, 1999లో నేరెళ్ల ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2009లో చొప్పదండి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు.

రుద్రవరం నుంచి సిరిసిల్ల దాకా..

వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రేగులపాటి పాపారావు 1968 నుంచి 1981 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 1981 నుంచి 1986 వరకు వేములవాడ సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1999లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వెంకట్రావుపేట నుంచి అసెంబ్లీకి..

మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట సర్పంచ్‌గా 1968లో పనిచేసిన కొమురెడ్డి రాములు 2004లో మెట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య కొమురెడ్డి జ్యోతి సైతం మెట్‌పల్లి ఎమ్మెల్యేగా అంతకుముందే గెలిచారు.

మొగిలిపేట నుంచి జెడ్పీ చైర్మన్‌ వరకు

మల్లాపూర్‌ మండలం మొగిలిపేటకు చెందిన కె.వి.రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా 1959 నుంచి 1981 వరకు కొనసాగారు. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపికవుతూ 2004లో కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యారు.

ధనువాడ నుంచి అసెంబ్లీ స్పీకర్‌గా..

ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధనువాడ సర్పంచ్‌గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 వరకు శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. శ్రీపాదరావు మరణానంతరం అతని తనయుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు.

రేకొండ నుంచి ఎమ్మెల్యే వరకు..

ప్రస్తుత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాజకీయ ప్రస్తానం సర్పంచ్‌గానే మొదలైంది. చిగురుమామిడి మండలం రేకొండ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన జడ్పీటీసీగా, ఎంపీపీగా, హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు.

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు
1
1/5

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు
2
2/5

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు
3
3/5

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు
4
4/5

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు
5
5/5

అంతర్గాం నుంచి అమాత్యుడి వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement