ఇసుక టిప్పర్లు పట్టివేత
ధర్మపురి: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మండలంలోని ఆరెపెల్లి, మగ్గిడి గోదావరి తీరం నుంచి గురువారం వేకువజామున ఇసుక తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని ఇసుకు తరలిస్తున్న ఆరు టిప్పర్లను పట్టుకొని ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పంచాయతీ ఎన్నికలు
పకడ్బందీగా నిర్వహించాలి
జగిత్యాలక్రైం: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఎస్పీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్లు, పోలింగ్ కేంద్రాలు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తన, నియమావళి అమలు, క్రిటికల్ ప్రాంతాలపై పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ముగిసేవరకు పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాల వివరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల అనంతరం విజేతలు ర్యాలీ నిర్వహించే అవకాశం ఉన్నందున భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్‌అలీఖాన్, రఫీక్‌ఖాన్ పాల్గొన్నారు.
ఇసుక టిప్పర్లు పట్టివేత


