దీక్ష దివస్ విజయవంతం చేయాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు
జగిత్యాల: దీక్ష దివస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని, 29న దీక్ష దివస్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని వెల్లడించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో అంబేడ్కర్ సూర్యుడు అనే బుక్‌ను ఆవిష్కరించారు. రాజ్యాంగం వల్లే పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


