రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
జగిత్యాలక్రైం: రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉందని, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్సీ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడంతోపాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలు పొందుపర్చారని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. న్యాయ వ్యవస్థ, చట్టసభలు, పాలన యంత్రాంగాల ద్వారా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవనం సాగించేలా రూపొందించారని గుర్తు చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, ఆర్‌ఎస్సైలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.


