మోసగాళ్ల అరెస్ట్
కోనరావుపేట(మానకొండూర్): ఇంట్లో బంగారు నిధి ఉందని నమ్మించి దంపతుల నుంచి భారీ మొత్తంలో నగదు కాజేసిన మోసగాళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు వేణు ఇంట్లో బంగారం నిధి ఉందని, ఎవరో మంత్రాలు చేశారంటూ పెద్దూరుకు చెందిన మేకల నరేశ్ నమ్మబలికాడు. తనకు తెలిసిన బాబా అయితే బంగారు నిధి తీసి ఇస్తాడని నమ్మించి సదుల దేవేందర్, పెద్దూరుకు చెందిన కడవంచ ప్రసాద్, సదుల రాజేశంను తీసుకెళ్లాడు. ఇలా నమ్మించి ఆ దంపతుల నుంచి విడతల వారీగా రూ.3వేలు, రూ.50వేలు, రూ.15వేలు, రూ.3.40 లక్షలు వసూలు చేశాడు. తర్వాత నరేశ్ ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన వేణు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిజామాబాద్ శివారులో మేకల నరేశ్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3లక్షలు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.
మోసగాళ్ల అరెస్ట్


