దర్శకుడు సంపత్ నందికి పితృవియోగం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య(75) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఓదెల గ్రామ శివారులో కిష్టయ్య అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన సినీపరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు, గ్రామస్తులు కిష్టయ్య అంత్యక్రజుయలకు హాజరయ్యారు. నివాళి అర్పించారు. ఆయనకు కుమారులు సంపత్ నంది, రమేశ్ ఉన్నారు. సదాశయఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, ప్రధానకార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి మేరు గు జ్ఞానేంద్రచారి సూచనతో కిష్టయ్య కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు.


