భర్త వేధింపులు భరించలేక..
● భర్తను కత్తితో నరికి చంపిన భార్య
● మల్లాపూర్‌లో దారుణం
మల్లాపూర్: భర్త వేధింపులు భరించలేక కత్తితో నరికి చంపిన ఘటన మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య, రాజు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి అయ్యింది. కొంతకాలంగా భార్యతో మల్లయ్య గొడవ పడుతున్నాడు. నిత్యం దుర్భాషలాడుతున్నాడు. వ్యవసాయం చేసే విషయమై మంగళవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉందయం కుమారుడు, కోడలు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. అప్పటికే బయటకు వెళ్లి వచ్చిన మల్లయ్య.. భార్యతో గొడవపెట్టుకున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక మల్లయ్య మెడపై కత్తితో నరికింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు లొంగిపోయింది. సీఐ అనిల్, ఎస్సై రాజు సిబ్బందితో వచ్చి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బోయినపల్లి(వేములవాడ): బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన వృద్ధుడు అంజయ్య(65) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. అంజయ్య వండ్రంగి పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. కొదురుపాక పాత గ్రామంలో ముంపునకు గురైన ఓ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ, కూతురు మమత ఉన్నారు. అంజయ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
సిరిసిల్ల అర్బన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు క్తి మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన అలిశెట్టి మహేశ్(40) వేములవాడలోని ఓ టెంట్ హౌస్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని సిరిసిల్ల బస్టాండ్‌లో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలోనే పెద్దూరు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య భవ్యశ్రీ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భర్త వేధింపులు భరించలేక..
భర్త వేధింపులు భరించలేక..


