జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
కరీంనగర్‌టౌన్: అత్యంత వెనుకబడిన మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని భారతీయ మత్స్యకార్మిక నంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీవీఎస్ స్టాన్లీ డిమాండ్ చేశారు. నగరంలో జరుగుతున్న తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక నంఘం నాలుగో రాష్ట్ర మహానభల్లో రెండోరోజు బుధవారం ఆయన మాట్లాడారు. ప్రమాద సమయంలోనే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు అత్యవసర సాయం అందించాలని, భద్రత కోసం పరికరాలు, జీఎస్, లైఫ్ జాకెట్లు ఉచితంగా అందించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ, కేరళ తరహాలో బీమా కల్పించాలని, ప్రమాదం, సహజ మరణం సంభవిస్తే రూ.20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. రాష్త్రంలో 10 హోల్‌సేల్, 100 రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. జలవనరులు కబ్జాకు గురికాకుండా శాటిలైట్ నర్వే ద్వారా ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించాలన్నారు. రూ.100 కోట్లతో శిథిలావస్థలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. నాయకులు వర్ణ వెంకట్‌రెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, యు.శ్రీనివాస్, గీట్లముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్, గంగాధర కనకయ్య, పిట్టల వెంకటేశ్, జునగరి గణేశ్, పప్పు సదానందం, మర్రి శశికళ, నాగుల అరుణ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీవీఎస్ స్టాన్లీ


