రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందగా, రెండేళ్ల చిన్నారి అనాథగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధా న రహదారిలో వేములవాడ నుంచి ఎదురుగా వస్తున్న లారీ, కరీంనగర్ నుంచి వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన వసీమ్(27) అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య ఐఫా(22)ను అంబులెన్స్‌లో వేములవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలింది. వీరి రెండేళ్ల పాప మైవిష్‌ఫాతిమా కాలు విరిగింది. చిన్నారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్లలోని బంధువుల శుభకార్యం కోసం వస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
అనాథగా మారిన రెండేళ్ల చిన్నారి
రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం


