అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో మంగళవారం అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. రాచర్ల గొల్లపల్ల్లికి చెందిన అందె నీరజ(25) ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం తన కుమారుడిని స్కూల్‌కు పంపించి, ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీరజ ఆడపడచు వదినతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లగా ఎంతకూ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన ఆమె కిటికిలో నుంచి చూడగా నీరజ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె పోలీసులు, బంధువులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే నీరజ మృతి చెంది ఉంది. ఈమేరకు నీరజ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రెండుసార్లు యత్నించి..
మూడోసారి ఆత్మహత్య చేసుకుని..
● సింగరేణి రిటైర్డ్ కార్మికుడి బలవన్మరణం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ద్వారకానగర్‌కు చెందిన బండారి రాములు(65) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మంగళవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాములు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున మృతుడి భార్య భాగ్యలక్ష్మి నిద్రలేచి చూడగా ఇంట్లో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తన కుమారుడికి ఫోన్‌చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ సురేందర్ కేసు నమోదు చేసుకున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి


