ముంబైలో చిత్రకళా ప్రదర్శన
రుద్రంగి(వేములవాడ): ముంబై మహానగరంలోని ప్రఖ్యాత జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కాంప్లెక్స్–హిర్జీ గ్యాలరీలో తెలంగాణ యువకుడి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మంచె శ్రీనివాస్ తన చిత్రకళను ఈనెల 24 నుంచి 30 వరకు ప్రదర్శించనున్నారు. బృహన్ ముంబై మహానగర పాలకసంస్థ అసిస్టెంట్ కమిషనర్ అల్లే చక్రపాణి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ శ్రీనివాస్ గీసిన చిత్రాలు సమాజానికి సందేశాన్నిచ్చేలా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అథితులుగా స్వయం కృషి ఫౌండేషన్ సభ్యులు పిల్లమారపు గంగాధర్, ద్యావరశెట్టి గంగాధర్, శ్రీపతి శ్రీనివాస్, దేవరశెట్టి శ్రీధర్, ఆడేపు రాంమోహన్, తాటికొండ శివకుమార్, పూల రామలింగం హాజరై పట్టుదల, కృషితో చిత్రకళలో జాతీయస్థాయిలో రాణిస్తూ నేటియువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మంచె శ్రీనివాస్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గడ్డం హరీష్, శ్రీధర్, సాయి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న చిత్రాలు


