గ్రామాల్లో పండుగ వాతావరణం
జగిత్యాల/జగిత్యాలరూరల్/రాయికల్: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో 2,434 ఎస్‌హెచ్‌జీలకు రూ.2.12 కోట్ల రుణాలు పంపిణీ చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లు, 9 మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు, ఏడుగురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రాయికల్ మండలంలోని అల్లీపూర్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. శివాజీరెడ్డి గార్డెన్స్‌లో 142 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, 35 మందికి ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు, 11 మందికి షాదీముబాకర్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జగిత్యాల రూరల్ తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవోలు రమాదేవి, విజయలక్ష్మీ, ఎంపీవో వాసవి, రాయికల్‌లో సింగిల్ విండో చైర్మన్లు ఏను గు మల్లారెడ్డి, రాజలింగం, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్‌రావు, మోర హన్మండ్లు పాల్గొన్నారు.


