జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర లింగాల ఆలయంలో మంగళవారం శ్రీగురుదత్తాత్రేయస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నలమాసు గంగాధర్, భక్తులు పాల్గొన్నారు.
వరి కొయ్యలు కాల్చితే భూసారానికి ముప్పు
జగిత్యాలఅగ్రికల్చర్: వరి కొయ్యలు కాల్చితే భూసారానికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. జగిత్యాలరూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. వరి కొయ్యలు కాల్చడం ద్వారా భూమిని సారవంతం చేసే వానపాములు అధిక ఉష్ణోగ్రతల వల్ల చనిపోతాయన్నారు. రైతుల ఊపిరతిత్తులు, అలర్జీ ఇబ్బంది కలుగుతుందన్నారు. నీటి నిల్వ శక్తి తగ్గిపోతుందన్నారు. ఆయన వెంట జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాంప్రసాద్, టెక్నికల్ ఏడీ రాజులనాయుడు ఉన్నారు.
మొరం, గ్రానైట్ తీస్తే చర్యలు
జగిత్యాలరూరల్: అనుమతి లేకుండా మొరం, గ్రానైట్ తీస్తే చర్యలు తప్పవని జిల్లా మైనింగ్ అధికారి జైసింగ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగాపూర్‌లోని సర్వే నంబరు 437 పరిసర ప్రాంతాలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం, గ్రానైట్ తీసేందుకు ఎలాంటి అనుమతులూ లేవని, ఎవరైనా తరలిస్తే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ భూమిలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
డిప్యూటీ వైద్యాధికారిగా జైపాల్‌రెడ్డి
మెట్‌పల్లి: జిల్లా డిప్యూటీ వైద్యాధికారిగా జైపాల్‌రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఈయన జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనంగా మెట్‌పల్లి డివిజన్ డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు మంళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డీపీవోగా రఘువరణ్
జగిత్యాలరూరల్: డీపీవోగా డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌ను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీపీవో రేవంత్ శిక్షణలో ఉండడం.. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రఘువరణ్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రూ.10.69 కోట్ల వడ్డీలేని రుణం
జగిత్యాల: సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు శుభవార్త ఇచ్చింది. గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీని విడుదల చేసింది. జిల్లాకు రూ.10.69 కోట్లు వచ్చాయి. ఈ వడ్డీ రాయితీ గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండగా.. తాజాగా విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రభుత్వం విడుదల చేసింది. నియోజకవర్గాల వారిగా మంగళవారం నుంచే పంపిణీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కోడ్ రాకముందే రాయితీ సొమ్మును ఇస్తున్నారు.
సహస్ర లింగాలయంలో పూజలు
సహస్ర లింగాలయంలో పూజలు
సహస్ర లింగాలయంలో పూజలు
సహస్ర లింగాలయంలో పూజలు


