శిశుమరణాలు తగ్గించాలి
జగిత్యాల: శిశుమరణాలు తగ్గించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. వైద్య కళాశాలలో మాతాశిశు సంరక్షణ నవజాత శిశువుల సంరక్షణపై మంగళశారం శిక్షణ ఇచ్చారు. శిశు మరణాల రేటు వెయ్యి సజీవ జననాలకు 24గా ఉందని, దీనిని 10లోపు తీసుకురావాలన్నారు. సీ్త్రలకు కౌమారదశ నుంచే ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. ప్రజల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశాకార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. గర్భధరించిన 12 వారాల్లోపు రిజిస్ట్రేషన్ చేసి ధనుర్వాతం రాకుండా నెల విరామంతో టేటానస్ డిప్తిరియా డోస్ ఇవ్వాలన్నారు. ఆకుకూరలు, కూరగాయలు తినాలని సూచించారు. డెలివరీ అయిన వెంటనే పిల్లలకు ముర్రుపాలు పట్టించేలా అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ ఎంజీ.కృష్ణమూర్తి, అరుణకుమారి, జైపాల్‌రెడ్డి, స్వరూప పాల్గొన్నారు.


