ఇందిరమ్మ చీరల పంపిణీ
కథలాపూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి మహిళకూ చీరలు ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య ఉండొద్దని కొత్తగా 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేశామన్నారు. సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పులి శిరీష, డైరెక్టర్లు వాకిటి రాజారెడ్డి, జవ్వాజి చౌదరి, కాయితి నాగరాజు, విజయ్, లింగంగౌడ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ చీరలు
మేడిపల్లి: అర్హులందరికీ ఇందిరా మహిళ శక్తి చీరలు అందిస్తామని విప్ అన్నారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో చీరలు పంపిణీ చేశారు. 25 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించారు. పార్టీ మండలాల అధ్యక్షులు ఏనుగు రమేశ్ రెడ్డి, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు తదితరులుపాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ టెక్నికల్ డీఈగా అంజయ్య
జగిత్యాలఅగ్రికల్చర్: ఎన్‌పీడీసీఎల్ టెక్నికల్ డీఈ గా ఎన్.అంజయ్య నియమితులయ్యారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎధ్యీ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిశారు. అంజయ్యకు ప లువురు శుభాకాంక్షలు తెలిపారు.


