కొనుగోలు కేంద్రం పరిశీలన
వెల్గటూర్:ఎండపల్లి మండలం గుల్లకోటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. తూకం వేసి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ అనిల్, కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం:బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
సీఎంఆర్ సేకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
జగిత్యాలరూరల్: గత యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి రైస్‌మిల్లర్లకు అప్పగించిన విషయం తెల్సిందే. ఆ ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కేంద్రం సీఎంఆర్ (కస్టమ్‌మిల్లింగ్ రైస్) సేకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మిల్లర్ల నుంచి సుమారు 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని 2026 ఫిబ్రవరి 28 వరకు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజులుగా బియ్యం అప్పగించేందుకు ఎదురుచూస్తున్న మిల్లర్లకు కేంద్రం నిర్ణయం ఊరటనిచ్చిట్లయ్యింది. మిల్లర్లంతా ఫిబ్రవరి 28లోపు ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాలని జిల్లా అధికారులు సూచించారు.
మైనార్టీ గురుకులం విద్యార్థుల ఆందోళన
జగిత్యాలక్రైం: తమను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రవికుమార్ ఇష్టారీతిన తిడుతున్నారని, ఒక్కోసారి కొడుతున్నారంటూ జిల్లా కేంద్రంలోని ఖిలాగడ్డలోగల మైనార్టీ బాలుర గురుకులం విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పదో తరగతి విద్యార్థులు పాఠశాల ముందే ఆందోళనకు దిగారు. విద్యార్థులకు రవికుమార్ క్షమాపణ చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పిల్లలకు నచ్చజెప్పి క్లాస్‌లకు పంపించారు.
ఎన్నికల్లో విజయం సాధించాలి
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల సందర్భంలో పొరపాటుగా తొలగించిన ఓట్లను గుర్తించి అధికారులకు తెలియచేయాలన్నారు. ప్రజల్లో ఇంకా బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం ఉందన్నారు. నాయకులు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
కొనుగోలు కేంద్రం పరిశీలన
కొనుగోలు కేంద్రం పరిశీలన


