ఇందిరమ్మ ఇళ్లతో కల సాకారం
గొల్లపల్లి: ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రానికి చెందిన ఆవుల సాయవ్వ సోమవారం గృహప్రవేశం చేయగా మంత్రి పాల్గొన్నారు. మాట్లాడారు. అర్హులందరికీ ఇల్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందన్నారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని బిల్లులు పొందాలన్నారు. కలెక్టర్ బి.సత్యప్రసాద్‌తో కలిసి సాయవ్వ ఇంట్లో భోజనం చేశారు. అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం
వెల్గటూర్: మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అన్నారు. ఎండపల్లి మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించే లక్ష్యంతో చీరలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ గోపిక, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ అనిల్, ఎంపీడీవో కృపాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మోహన్‌రావుపేటలో..
కోరుట్లరూరల్: మండలంలోని మోహన్‌రావుపేటలో కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం చీరలు ఇస్తుండడం సంతోషమేనని, ఇందిరమ్మ చీరలని కాకుండా బతుకమ్మ చీరలుగానే కొనసాగిస్తే బాగుండేదన్నారు. మహిళలు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్యం కోసం పౌష్టికాహార న్యూట్రీషన్ కిట్ పథకం కొనసాగించాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్‌విండో చైర్మన్లు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అధికారులూ.. మిల్లర్లతో మాట్లాడండి
ధర్మపురి: రైతులకు సమస్యలు ఎదురైతే మిల్లర్లతో మాట్లాడే బాధ్యత అధికారులు తీసుకోవాలని మంత్రి అన్నారు. మండలంలోని నేరెల్లలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి నాయకులు బాలాగౌడ్, జాజాల రమేశ్, శేర్ల రాజేశం తదితరులున్నారు.


