గోడ తొలగించండి
జగిత్యాల మండలం తిప్పన్నపేట శివారు సర్వే నంబర్ 375లోని 93గజాల మా సొంత భూమిలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మించారు. హెచ్‌ఎంను సంప్రదిస్తే స్పందించడం లేదు. స్థలాన్ని ఎన్నాకుల సత్తయ్య నుంచి దస్తావేజు నంబర్ 2723/ 2023 తేదీ 25–05–2013ద్వారా కొనుగోలు చేశాం. ప్రైమరీ స్కూల్ వారు నా సొంత స్థలంలో నిర్మించిన గోడను తొలగించేలా చూడండి.
– వావిలాల రమాదేవి జగిత్యాల
ధాన్యంలో తరుగు వద్దు
మాది మెట్‌పల్లి మండలం కోనరావుపేట. మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో రైస్‌మిల్లర్, సొసైటీ చైర్మన్ కలిసి సంచికి 2కిలోల తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. తరుగు లేకుండా ధాన్యం సేకరించేలా చూడండి.
– కోనరావుపేట గ్రామస్తులు
లేబర్ కోడ్‌లతో భద్రత కరువు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో అసంఘటిత రంగంలో ఉన్న మాకు ఉద్యోగ భద్రత కరువైంది. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయండి. – మెడికల్ రిప్రజెంట్లు
గోడ తొలగించండి
గోడ తొలగించండి


