ఇళ్లు కేటాయించండి
నూకపల్లిలో డబుల్ ఇళ్లు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. అర్హత ఉన్నా త మకు ఇళ్లు రావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరమ్మ స్థలాన్ని తీసుకుని ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చిన అధికారులు ప్రస్తుతం ఇళ్లు కేటాయించకపోవడం అన్యాయమన్నారు.
– డబుల్ ఇళ్ల ఆశావహులు
ఎంపీటీసీ స్థానం ఇవ్వండి
మాది మల్లాపూర్ మండలం ఓబులాపూర్. ధర్మాజిపల్లి, సంగెంశ్రీరాంపూర్, ఓబులాపూర్, ఓబులాపూర్ తండాలతో ఎంపీటీసీ స్థానం ఉంది. పరిధి, జనాభా అధికంగా ఉండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఓబులాపూర్, పక్కనేఉన్న తండాను కలిసి కొత్త ఎంపీటీసీ స్థానం ఏర్పాటు చేయండి.
– ఓబులాపూర్ గ్రామస్తులు
జీవనాధారం కోల్పోతున్నాం
మాది సారంగాపూర్ మండలం నాగునూర్. ముదిరాజ్ కులస్తులు చేపల పెంపకానికి మా ప ట్టాభూముల్లో నీటిని నిల్వచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్వీకుల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. సుమారు 40నుంచి 50ఎకరాల పట్టాభూములు కోల్పోయే ప్రమాదం ఉంది. పంట భూముల్లో నీరు నిల్వ చేయకుండా చూడండి.
– నాగునూర్ రైతులు
ఇళ్లు కేటాయించండి
ఇళ్లు కేటాయించండి


