ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
జగిత్యాలటౌన్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సత్యసాయిబాబా మందిరంలో నిర్వహించిన సత్యసాయి శతవర్ష వేడుకల్లో పాల్గొన్నారు. సేవాసమితి సమకూర్చిన కుట్టు మిషన్లు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్స్ నిరుపేద మహిళలు, దివ్యాంగులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మానవసేవయే మాధవసేవగా భావించిన సత్యసాయి బాబా ట్రస్ట్ సేవలు ప్రపంచంలోని 200 దేశాల్లో సేవలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి కన్వీనర్ బట్టు రాజేందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


