అంజన్న ఆలయ ఏఈవోగా హరిహరనాథ్
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఏఈవోగా హరిహరనాథ్‌ను నియమిస్తూ దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఏఈవోగా పదోన్నతి కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల డివిజన్ ఎన్పీడీసీఎల్ డీఈగా గంగారాం నియమితులయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌ఈ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈని ఉద్యోగ, కార్మిక సంఘాలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మెట్‌పల్లి: పట్టణం నుంచి అరుణాచలం యాత్రకు వెళ్లేందుకు డిసెంబర్ 2న ఆర్టీసీ బస్సు నడిపించనున్నట్లు డిపో మేనేజర్ దేవరాజ్ తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి కాణిపాకం, గోల్డెన్‌టెంపుల్ దర్శనం చేసుకుని మూడో తేదీన రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. 4న రాత్రి అక్కడి నుంచి బయల్దేరి మహానంది, జోగులాంబ ఆలయాల దర్శనం చేసుకుని 5న రాత్రి మెట్‌పల్లికి చేరుకుంటుందన్నారు. టిక్కెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.3760గా నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
జగిత్యాలటౌన్: ఫిరాయింపుదారులతో అభివృద్ధి ఎలా సాధ్యమని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల పార్టీ మారిన నాయకులు నియోజకవర్గ అభివృద్ధి అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారని, కాంగ్రెస్ నాయకులతో సాధ్యం కాని అభివృద్ధి ఫిరాయింపుదారులకు ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో పార్టీ జిల్ల అధ్యక్షుడు గాజంగి నందయ్యను సన్మానించారు. మంత్రి అడ్లూరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి మాట్లాడుతూ ఆలస్యమైనా.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించి అవకాశం కల్పించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కోరారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీ తన బిడ్డలను కాపాడుకోగలదని, తన పోటీ పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కాదని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పోటీపడ్డానని, పులివెందులకు ధీటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. నందయ్య నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు జయశ్రీ, పిప్పరి అనిత, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘువీర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంజన్న ఆలయ ఏఈవోగా హరిహరనాథ్


