బిర్సాముండాకు నివాళి
జగిత్యాలటౌన్: స్వాతంత్య్ర సమరంలో మొట్ట మొదటి గిరిజన యోధుడు బిర్సాముండా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శనివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వారు అక్రమంగా పన్నులు వసూలు చేయడానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీశాలి బిర్సా ముండా అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జుంబర్తి దివాకర్, సాంబారి కళావతి తదితరులు పాల్గొన్నారు.
దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం
25ఏళ్ల వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప గిరిజన యోధుడు బిర్సాముండా అని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం జగిత్యాల కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రేవంత్, ప్రమోద్, జైపాల్‌రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు.
టెండర్లు ఆహ్వానం
కొడిమ్యాల: మండలంలోని నల్లగొండలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పట్టెనామాలు, కోరమీసాలు, కొబ్బరిముక్కల సేకరణకు సంబంధించి ఈనెల 27న బహిరంగ వేలం ఉంటుందని ఆలయ ఈవో వెంకన్న తెలిపారు. బహిరంగవేలంలో ఎక్కువ పాట పాడిన వారికి టెండర్ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. టెండర్ ఫారాలు 26 నుంచి ఆలయ కార్యాలయంలో లభిస్తాయని రూ.200 చెల్లించి కోట్ చేసి 27న సీల్ చేసి బాక్స్‌లో వేయాలని తెలిపారు. పట్టేనామాలు, కోరమీసాలు అమ్ముకునే హక్కు కోసం రూ.లక్ష, కొబ్బరిముక్కల సేకరణ హక్కుకు రూ.30వేలు డిపాజిట్ చేయాలని తెలిపారు. వివరాల కోసం ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.


